టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. పూణే వేదికగా న్యూజిలాండ్ పై జరిగిన రెండో టెస్టులో ఔటైన తర్వాత కోహ్లీ చేసిన పని వైరల్ అవుతుంది. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటైన విరాట్.. రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేసి నిరాశ పరిచాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీకి బ్యాడ్ లక్ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది.
ఇన్నింగ్స్ 30 ఓవర్లో సాంట్నర్ లెంగ్త్ బాల్ ను కోహ్లి బ్యాక్‌ఫుట్ దిశగా ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బంతి స్కిడ్ అయ్యి ప్యాడ్‌పైకి దూసుకొచ్చింది. ప్యాడ్లకు తగలడంతో ఔట్ కోసం న్యూజిలాండ్ అప్పీల్ చేసింది. అంపైర్ కోహ్లీని ఔట్ గా ప్రకటించాడు. లెగ్ స్టంప్ ను మిస్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో కోహ్లీ రివ్యూకు వెళ్ళాడు. బాల్ ట్రాకింగ్ లో బంతి వికెట్లను లెగ్ వికెట్ అంచుకు తాకుతున్నట్టుగా చూపించింది. అంపైర్స్ కాల్ రావడంతో కోహ్లీ ఔట్ కాక తప్పలేదు. ఒకవేళ అంపైర్ నాటౌట్ ఇచ్చి ఉంటే కోహ్లీ ఔటయ్యేవాడు కాదు.
కోహ్లీ ఔటైన తర్వాత కోపంతో పెవిలియన్ కు వెళ్ళాడు. డ్రెస్సింగ్ రూమ్ ముందు తీవ్ర అసహనానికి గురైన అతను బ్యాట్ తో ఐస్ బాక్స్‌ను పగలగొట్టాడు.కోహ్లీ చేసిన చర్యపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. దిగ్గజ హోదాలో ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటుంటే.. కోహ్లీ పై అంపైర్ కు ఎందుకు ఇంత పగ అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఈ సిరీస్ లో కోహ్లీ పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. బెంగళూరు టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 70 పరుగులు మినహాయిస్తే మిగిలిన మూడు ఇన్నింగ్స్ ల్లో విఫమయ్యాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే కివీస్ నిర్ధేశించిన 359 పరుగుల భారీ ఛేదనలో టీమిండియా 245 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ (8), శుభ్ మన్ గిల్(23), రిషబ్ పంత్ (0), విరాట్ కోహ్లీ(17), సర్ఫరాజ్ ఖాన్(9), వాషింగ్టన్ సుందర్(21).. ఇలా ఏ ఒక్కరూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేయలేదు. దాంతో, టీమిండియాకు ఓటమి తప్పలేదు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేయగా.. భారత్ 155 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ జట్టు 255 పరుగులు చేసింది.
Dear bro Virat Kohli, The bat is hit over the ball, not over this water box.? #INDvNZ pic.twitter.com/FZshuZIkzL
— ???????⁴⁵ (@rushiii_12) October 26, 2024