IPL 2025: కోహ్లీ ఒక్కడే రిటైన్.. మిగిలిన RCB ఆటగాళ్ల పరిస్థితి ఏంటి..?

ఐపీఎల్ 2025 కు సంబంధించి రిటైన్ చేసుకునే ప్లేయర్ల సమయం దగ్గర పడుతుంది. అక్టోబర్ 31 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే చివరి తేదీ. 2025 ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ జరగనుండడంతో ఎవర్ని రిటైన్ చేసుకోవాలో అనే విషయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సందిగ్ధంలో పడింది. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీ ఆర్సీబీ జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. రూ. 18 కోట్ల రూపాయలతో అతడు మొదటి రిటైన్ ప్లేయర్ గా ఉండడం ఖాయమైంది. 

కోహ్లీ ఒక్కడినే రిటైన్ చేసుకుని మిగిలిన ఆటగాళ్లను మెగా యాక్షన్ లోకి వదిలేసినా పెద్దగా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జట్టులో రూ. 14 కోట్ల రూపాయలు విలువ చేసే ఆటగాళ్లు కనిపించడం లేదు. డుప్లెసిస్ వయసు పెరగడంతో అతన్ని RTM కార్డు ఉపయోగించి తీసుకునే ఉద్దేశ్యంలో ఆర్సీబీ యాజమాన్యం ఉంది. దీంతో సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ కెప్టెన్ డుప్లెసిస్ కు ఈ సారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. అతని కెప్టెన్సీలో ఆర్సీబీ అద్భుత విజయాలు సాధించినా టైటిల్ గెలవడంతో విఫలమైంది.

Also Read : రంజీ ట్రోఫీలో..మళ్లీ ఓడిన హైదరాబాద్

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ దారులు దాదాపుగా మూసుకుపోయినట్టే. మ్యాక్సీ ఆర్సీబీను అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబి జట్టులో కొనసాగడం కష్టం. 2023 మినీ యాక్షన్ లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలంలోకి రానున్నారు. వీరిద్దరూ నాణ్యమైన ప్లేయర్లే అయినా.. అంత భారీ మొత్తంలో చెల్లించడానికి ఆర్సీబీ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. పటిదార్, విల్ జాక్స్, సిరాజ్ లను RTM కార్డు ద్వారా తీసుకోవచ్చు