India vs India A: ప్రాక్టీస్ మ్యాచ్‌లో కుర్రాళ్ళ ధాటికి విల విల.. కోహ్లీతో పాటు ఇద్దరికి గాయాలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పెర్త్ వేదికగా ఇండియా ఏ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు బాగా ఇబ్బందిపడ్డారు. ఈ మ్యాచ్ లో ఒక్క భారత బ్యాటర్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. యువ పేసర్లు ముఖేష్ కుమార్, ప్రసిద్ కృష్ణ, నవదీప్ సైనీ, నితీష్ కుమార్ రెడ్డి ధాటికి ఒక్కరు కూడా క్రీజ్ లో నిలబడలేకపోయారు. బ్యాటింగ్ లో విఫలం కావడంతో పాటు ముగ్గురు భారత ఆటగాళ్లకు గాయాలయ్యాయి. 

ప్రాక్టీస్ మ్యాచ్ ముందు గురువారం(నవంబర్ 14) విరాట్ కోహ్లికి గాయమైనట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా అతను స్కానింగ్ కు వెళ్లినట్టు సమాచారం. కోహ్లీ గాయంపై ఎలాంటి ఆందోళన లేదని తెలుస్తుంది. మరోవైపు కేఎల్ రాహుల్ శుక్రవారం (నవంబర్ 15) జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో రాహుల్ మోచేతికి గాయమైంది. ప్రసిద్ కృష్ణ డెలివరీ రాహుల్ మోచేతికి బలంగా తాకింది. దీంతో 29 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.

ALSO READ | Champions Trophy 2025: ఆ నగరాల్లో ట్రోఫీని తిప్పడానికి వీల్లేదు.. పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ ఝలక్

రిపోర్ట్స్ ప్రకారం రాహుల్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని గాయంపై ఇంకా ఎలాంటి అప్ డేట్ రాలేదు. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కు సైతం మోచేతి గాయమైంది. ఓపెనర్ జైశ్వాల్ కూడా పదునైన బంతులకి ఇబ్బందిపడినట్టు తెలుస్తుంది. పెర్త్ వేదికగా వాకా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఏ జట్టు సీనియర్ జట్టుపై ఆధిపత్యం చూపించింది. యువ పేసర్ల ధాటికి ఒక్క బ్యాటర్ కూడా నిలబడలేకపోయారు.

ముఖ్యంగా పేలవ ఫామ్ తో ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ కేవలం 15 పరుగులే చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔటయ్యాడు. సూపర్ ఫామ్ లో ఉన్న యశస్వి జైశ్వాల్ 15 పరుగులకే ఔట్ కాగా.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి రిషబ్ పంత్ ను 19 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. మిగిలిన ఆటగాళ్లలో గిల్ 29 పరుగులు చేయగా.. 29 పరుగుల వద్దే రాహుల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.