టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ 9 ఇన్నింగ్స్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో 12 ఏళ్ళ తర్వాత టాప్ 25 లో చోటు కోల్పోయాడు. కోహ్లీ ఫామ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఘోరంగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. విరాట్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తే అతని టెస్ట్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ కఠిన సవాలుకు ముందు కోహ్లీ ఇంగ్లాండ్ కౌంటీల్లో కనబడే అవకాశం ఉంది. ఇప్పటికే కోహ్లీ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి. టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి హెడ్డింగ్లీలోని లీడ్స్‌లో ప్రారంభమవుతుంది. ఐపీఎల్ తర్వాత కోహ్లీ కౌంటీల్లో ఆడతాడనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకోకపోతే కోహ్లీకి కౌంటీల్లో ఎక్కువ మ్యాచ్ లు ఆడడానికి ఛాన్స్ ఉంది.
Also Read : వరల్డ్ కప్ సీన్ రిపీట్..?
భారత జట్టుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ సైతం కోహ్లీ ఫామ్ లోకి రావడానికి దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించారు. 2012 లో కోహ్లీ చివరిసారిగా దేశవాళీ క్రికెట్ ఆడాడు.
Virat Kohli likely to play County Cricket ahead of the England Test series 2025!? pic.twitter.com/FV6Wa7ijC7
— CricketGully (@thecricketgully) January 9, 2025