Ranji Trophy 2024-25: ఐదేళ్ల తర్వాత తొలిసారి.. రంజీ ట్రోఫీ స్క్వాడ్‌‌లో కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో పేలవ ఫామ్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీ లాంటి దిగ్గజ  బ్యాటర్ ఫామ్ లో రావడానికి ఒక్క మ్యాచ్ చాలు. అయితే ఆశ్చర్యకరంగా విరాట్ కోహ్లీని రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్ కు ఎంపిక చేశారు. అక్టోబర్ 11న ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ 84 మంది ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించింది. ఈ స్క్వాడ్ లో కోహ్లీ పేరు ఉండడం సంచలనంగా మారుతుంది.

2019 లో విరాట్ కోహ్లీ చివరిసారిగా రంజీ స్క్వాడ్ లో సెలక్ట్ అయ్యాడు. మళ్ళీ ఐదేళ్ల తర్వాత రంజీల్లో అతని పేరును చేర్చారు. రంజీ ట్రోఫీకి ఎంపికైనా.. విరాట్ ఈ టోర్నీ ఆడడటం దాదాపుగా అసాధ్యం. రానున్న నాలుగు నెలల్లో భారత్ 8 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ తో టెస్ట్ తో పాటు.. స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రంజీ ట్రోఫీ అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ రంజీ ట్రోఫికి ఎంపికైన ఆడే అవకాశం కనిపించడం లేదు.

Also Read:-టీమిండియాకే నష్టం.. కాన్పూర్ టెస్టుకు భారీ వర్ష సూచన


 
విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ లిస్టులో ఉన్నాడు. మరోవైపు ఢిల్లీ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ప్రస్తుతం కోహ్లీ బంగ్లాదేశ్ తో రెండో టెస్టుకు సిద్ధమవుతున్నాడు. తొలి టెస్టులో విఫమలైన కోహ్లీ.. రెండో టెస్టులో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరగనుండడంతో అందరి కళ్ళు కోహ్లీపైనే ఉన్నాయి. చెన్నై వేదికగా ఇటీవలే ముగిసిన టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులు.. రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేసి నిరాశపరిచాడు.