Virat Kohli: సెల్ఫీ కోసం కోహ్లీ చేయి పట్టుకొని లాగిన మహిళా అభిమాని

టీమిండియా స్టార్ బ్యాటర్ అభిమానుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. ఫ్యాన్స్ ఎక్కడ కనబడి సెల్ఫీ అడిగినా సహనం కోల్పోకుండా ఎంతో ఓపిగ్గా వారికి సెల్ఫీ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టీమిండియాలోని కాదు ప్రపంచంలో కోహ్లీ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ను ఎప్పుడూ నిరుత్సాహానికి గురి చేయడు. తాజాగా ఒక మహిళా అభిమాని విషయంలో కోహ్లీ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. 

ముంబైలోని ఓ మహిళా అభిమాని విరాట్ కోహ్లి వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ మహిళా కోహ్లీ చేయి పట్టుకొని లాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనతో సెల్ఫీ కోసం ఆ మహిళ ఆరాటం తెలుసుకున్న కోహ్లీ కొంచెం కూడా కోపం తెచ్చుకోకుండా సానుకూలంగా స్పందించాడు. ప్రశాంతంగా ఉంటూ ఆమెకు సెల్ఫీ ఇచ్చి పంపించాడు. సెల్ఫీ ఇచ్చే సమయంలో కోహ్లీ స్పందించిన విధానం నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ అయితే విరాట్ ను తెగ పొగిడేస్తున్నారు. 

ALSO READ : ENG v WI 2024: ఇంగ్లాండ్‌తో విండీస్ ఢీ.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. పేలవ ఫామ్ లో ఉన్న విరాట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ తో పాటు యావత్ దేశం కోరుకుంటుంది. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ ఫామ్ ఘోరంగా ఉంది. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే మిగిలిన 5 ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ముందు అనుభవజ్ఞుడు కోహ్లీ ఫామ్ లోకి రాకపోతే భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం కష్టంగానే కనిపిస్తుంది.