Virat Kohli: ఆస్ట్రేలియాలో కింగ్ హవా.. న్యూస్​ పేపర్​ ఫ్రంట్ పేజీపై కోహ్లీ ఫోటో

భారత్ - ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్రేజ్ ఆకాశాన్ని దాటుతుంది. ఇరు జట్లకు ఈ టోర్నీ అత్యంత కీలకం కానుండడంతో హోరీహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే భారత క్రికెట్ జట్టు బ్యాచ్​లవారిగా అక్కడికి చేరుకుంటోంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం అందరికంటే ముందుగానే ఆస్ట్రేలియాలోకి ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. 

కోహ్లీ టెస్టుల్లో పేలవ ఫామ్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఈ సిరీస్ గెలవాలంటే కోహ్లీ ఫామ్ లోకి రావడం చాలా  కీలకం. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మీడియా మాత్రం విరాట్ కోహ్లీని తెగ హైలెట్ చేస్తుంది. అక్కడ వార్తా పత్రికలపై కోహ్లీని పొగడ్తలతో ముంచేస్తుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ప్రముఖ న్యూస్ పేపర్ 'ది డైలీ టెలిగ్రాఫ్‌'లో కోహ్లీ ఫొటోను ఫ్రంట్ కవర్‌ పేజీపై ప్రచురించింది. ఈ మ్యాగజిన్ లో కోహ్లీ క్రికెట్ లో సాధించిన ఘనతలు గురించి రాసుకొచ్చింది. కోహ్లీ సాధించిన రికార్డుల గురించి ఈ మ్యాగజిన్ లో రాయడం విశేషం. 

ALSO READ | Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోనున్న పాక్!

ప్రస్తుతం ఆస్ట్రేలియా మీడియా కోహ్లీకి ఇస్తున్న ఎలివేషన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఇదే వార్తా పత్రిక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ సెంచరీ చేసిన ఫొటోను ప్రచురించి అతని గురించి గొప్పగా రాసుకొచ్చింది. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ ఫామ్ ఘోరంగా ఉంది. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే మిగిలిన 5 ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ముందు అనుభవజ్ఞుడు కోహ్లీ ఫామ్ లోకి రాకపోతే భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం కష్టంగానే కనిపిస్తుంది. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ప్రస్తుతం భారత జట్టు దృష్టి మొత్తం ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ ను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై కానుండడం కంగారులకు కలిసి రానుంది. మరోవైపు టీమిండియా పేలవ ఫామ్ లో ఉంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.