Viral Video: పెళ్లిలో కలియోన్ కా చమన్ డ్యాన్స్...స్టెప్పులేసిన పెళ్లికూతురు.. వధువు తల్లి.. సోదరి..

ఒకప్పుడు పెళ్లి కూతురు పెళ్లి పీటల మీదకు సిగ్గుపడుతూ తలదించుకుని ఒద్దికగా వచ్చేది..   పెళ్లి అంటే హడావిడిగా ఉండేది.. ఆడ పెళ్లి వారు .. మగపెళ్లి వారికి మర్యాదలు చేయడంలో దృష్టి సారించేంవారు. అయితే కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా పెళ్లిళ్ల హడావిడి మారిపోయింది.  అంతేకాదు పెళ్లి వేడుకలో వధువు.. వరుడు.. వాళ్ల బంధువులు చేసే డ్యాన్స్ లు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి,

తాజాగా సోషల్ మీడియాలో ఓ పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.  ఈ వీడియోలో వధువు తల్లితో పాటు ..వధువు సోదరి.. ముగ్గురు కలిసి బాలీవుడ్ ఐకానిక్ ట్రాక్ 'కాలియోన్ కా చమన్ సాంగ్ కు డ్యాన్స్ వేసి అతిథులను విస్మయానికి గురిచేశారు. ఈ డ్యాన్స్ ను చూసిన గెస్ట్ లు నవ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్  ఇన్‌స్టాగ్రామ్‌లో 'arshweddingchoreography' ఖాతా షేర్ అయింది. 

ఈ వీడియోలో ఇద్దరు కుమార్తెలు రాధిక శర్మ ..  రసిక శర్మ ఉన్నారు, వారిలో ఒకరు వధువు. వీరు ముగ్గురూ, వారి కులాచారం  ప్రకారం  దుస్తుల ధరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇప్పటి వరకు ( వార్త రాసే సమయానికి)6.6 మిలియన్ల వీక్షణలు వచ్చాయి.  దీనిపై స్పందించిన నెటిజన్లు.. అమ్మ .. అందంగా ఉందని కొందరు పోస్ట్ చేయగా .. మరికొందరు డ్యాన్స్ అదుర్స్ అని ప్రశంశించారు.  ఇంకొందరు కాలియోన్ కా చమన్ డ్యాన్స్ ను దొంగిలించిందని కామెంట్ చేశారు.