పల్లెటూర్లలో కూరగాయలు, పండ్లు, అమ్ముకునే చిరువ్యాపారస్థులు వాళ్లు అమ్మే పేర్లతో అరుస్తూ కూతలు వేయడం తెలిసిందే. సిటీలో మాల్స్ వచ్చి వీధిలో వాళ్ల అరుపులు వంట గదిలోకి వినిపించకుండా పోయాయి కానీ.. పల్లెటూర్లలో ఆ అరుపులు ఇప్పటికీ చెవులను తాకుతూనే ఉన్నాయి. అరటిపళ్లు, ఆకుకూరలు ఏవి అమ్ముతున్నారో అర్థం కాని అరుపులు.. ఎంతో గమ్మత్తుగా ఉంటాయి. అయితే గల్లీలో పల్లీలు అమ్ముకునే ఓ వ్యక్తి సెన్సేషన్ అయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి జీవనం కొనసాగిస్తున్నాడు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బు రూ.250 నుంచి 300రూ. మాత్రమే. ఆ అమ్మడంలోనూ.. స్థానిక భాషలో అరవడంలోనూ ప్రత్యేకత ఉండాలనేది అతని తాపత్రయం. ఈ క్రమంలోనే పచ్చి పల్లీలను..కచ్చాబాదం అంటూ పాట రూపంలో తనదైన స్టైల్లో అరవడం మొదలుపెట్టాడు. అదే అతనిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసేసింది.
కచ్చా బాదం (పచ్చి పల్లీలు) అమ్ముకుంటున్న భుబన్ బద్యాకర్.. తాను అరుస్తూ అమ్ముతున్న విధానం కొందరికి నచ్చింది. దాంతో అది కాస్తా వైరల్ అయ్యింది. కచ్చా బాదం పాట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. నెటిజనులు, స్థానిక నేతల దగ్గరి నుంచి సెలబ్రిటీల దాకా అంతా అడిక్ట్ అయిపోయారు. కొరియాతో పాటు ఆఫ్రికా దేశాలకు సైతం పాకేసింది. షార్ట్ వీడియోస్‌లో రికార్డు స్థాయిలో వీడియోలతో కచ్చా బాదం రీమిక్స్ ఏలుతుండగా.. ఆ సాంగ్ ఒరిజినల్ క్రియేటర్ భూబన్ బద్యాకర్‌కి తగిన గుర్తింపూ దక్కింది. ఒకానొక దశలో పాట మీద రైట్స్ కోసం ఆయన పోలీసులను ఆశ్రయించాడనే వార్త ఒకటి చక్కర్లు కొట్టింది. అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కాపీ రైట్స్ వ్యవహారం తమ చేతుల్లో లేదంటూనే.. భూబన్‌కి కొంత ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు పలువురు పొలిటీషియన్లు, స్థానికులు, ఆయనకు చాలా సాయం అందించినట్లు తెలిసింది. ప్రభుత్వం స్పందించి.. తనకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతున్నాడు భూబన్. ఎప్పటిలాగానే తన వ్యాపారం చేసుకుంటూ.. అడపా దడపా ఇంటర్నెట్‌లో కనిపించాలని అనుకుంటున్నాడట.
సోషల్ మీడియాలో ఈ బెంగాలీ పాట కచ్చా బాదం తెగ హల్ చల్ చేస్తోంది. ఈ పాటకు పలువురు సెలబ్రిటీలు, కొంతమంది నెటిజన్లు డ్యాన్సులు వేస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నారు. సరికొత్తగా రీల్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా లక్షలాది వ్యూస్ కూడా సంపాదిస్తున్నారు. సాధారణ యూజర్ల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కచ్చా బాదం పాటకు పర్ఫామెన్స్ చేస్తుండటంతో ఈ పాట దాదాపు నెలకు పైగా నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట యూజర్లకు అర్ధం కాకపోయినప్పటికీ.. తెగ ఆకట్టుకుంటోంది. కచ్చా బాదమ్ పాట సాహిత్యం వింటుంటే.. మనకు కూడా స్టెప్పులు వేయాలనిపిస్తుంది. అందుకే ఈ పాట ఇంకా ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది.
Come on vibe with me ???#kachabadam pic.twitter.com/PvXkpPKugJ
— ManzaR (@ImManzarBhopali) January 28, 2022
Kacha Badaam Dance is a Nationwide Craze. It should Go International!! ?? #kachabadam pic.twitter.com/mBGA9c7odH
— Rosy (@rose_k01) January 29, 2022
