రెనాల్డ్స్ పెన్నుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా..ఎందుకంటే ఈ పెన్నుకున్న క్రేజే వేరు. చిన్ననాటి కాలంలో ఈ పెన్నును వాడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బ్లూ క్యాప్ తో వైట్ గా ఉండే ఈ పెన్ ను 1990 s లో పుట్టిన ప్రతి ఒక్కరికి సుపరిచితమే..
అయితే ఈ పెన్నులు గత కొన్నేళ్లుగా మార్కెట్లో తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ పెన్నులు ఇక కనిపించవని.. రెనాల్డ్స్ కంపెనీ కనుమరుగైపోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రెనాల్డ్స్ కంపెనీ స్పందించింది. ఆ పెన్నుల తయారీని ఆపే ప్రసక్తే లేదని చెప్పింది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వాటిని చూసి ఆందోళనకు గురికావొద్దని కంపెనీ కోరింది. రెనాల్డ్స్. 045 పెన్ డిజైన్ లోనూ ఎలాంటి మార్పులు చేయబోమనిప్రకటించింది. ఈ పెన్ ధర గతంలో రూ. 5 ఉండగా.. ఇపుడు రూ.10 గా ఉంది.
