ఇంట్లోకి చికెన్ కావాలంటే మీరు ఎన్ని కిలోమీటర్లు వెళతారు. ఇదిగో ఈయన మాత్రం తనకు ఇష్టమైన చికెన్ కోసం 32 కిలోమీటర్లు వెళ్లాడు.
అసలే కరోనా. పైగా లాక్ డౌన్. అయినా సరే ఆస్ట్రేలియా మెల్ బోర్న్ కు చెందిన ఓ వ్యక్తి లాక్ డౌన్ ను ఉల్లంఘించి 32కిలోమీటర్లు దూరం వచ్చి బటర్ చికెన్ ను కొనుగోలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ భోజన ప్రియుణ్ని అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ ను నిబంధనల్ని ఉల్లంఘించినందుకు మనకరెన్సీ ప్రకారం లక్షా 25వేలు జరిమానా విధించారు.
స్థానిక పోలీసుల ప్రకారం..లాక్ డౌన్ సమయంలో ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని, సుమారు 74మందికి పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
కాగా ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 11,800 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.
