గణేష్​ చతుర్థి 2024: ఏ రాశివారు ఎలాంటి వినాయకుడుని పూజించాలి.. నైవేద్యాలు ఏంటో తెలుసా..

Vinakaya chavithi 2024:  ప్రతి పండుగకు శాస్త్రీయ ఆచారం ఉందని పురాణాలు చెబుతున్నాయి.  శ్రావణ మాసం ( సెప్టెంబర్​ 2) ముగిసింది.  మంగళవారం ( సెస్టెంబర్​ 3) నుంచి బాధ్రపదమాసం ప్రారంభం కానుంది.  పిల్లల దగ్గరనుంచి పెద్దల దగ్గర వరకు ఒకటే హడావిడి... ఎక్కడ చూసినా గణపతి బొప్ప మోరియా ... నినాదాలు..  వినాయకుడి మండపాలను నిర్వాహకులు సిద్దం చేస్తున్నారు.  అయినా సరే హిందువులు ప్రతి ఇంట్లో కూడా వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.  వీలున్నర తొమ్మదిరోజులు పూజిస్తారు.   లేదంటే.. అదేరోజు ( సెప్టెంబర్​ 7)న పూజించి ఆ తరువాత నిమజ్జనం చేస్తారు. కొంతమంది మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు ఇలా ఎవరి అవకాశాన్ని బట్టి వారు పూజలు చేస్తుంటారు.

హిందువులు మట్టి వినాయకుడి ప్రతిమను రంగు రంగులతో అలంకరిస్తారు.  అయితే జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం....  అయితే ఏ రాశి వాళ్ళు ఏ రంగు వినాయకుడిని ప్రతిష్టించి పూజించాలి. ఏ మంత్రాలు పఠించాలో తెలుసుకోండి. ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. .. 

ఆటంకాలను తొలగించి ఆనందాన్ని ఇచ్చేవాడిగా వినాయకుడిని పూజిస్తారు. మరి కొద్ది రోజుల్లో అంటే సెప్టెంబర్​ 7న  వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. పంచాంగం ప్రకారం భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు వినాయకుడు జన్మించాడు. అందుకే ఈ రోజున గణేష్ చతుర్థి జరుపుకుంటారు. వినాయక చవితిని పది రోజులు పాటు  అంటే నవరాత్రిళ్లు జరుపుకుంటారు. ఏడాది మీరు ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని అనుకుంటున్నట్లయితే .  ఏ రాశి వాళ్ళు ఏ రంగు విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్టించి ఏ మంత్రం చదువుతూ పూజ చేయాలో తెలుసుకుందాం. 

ALSO READ | కిచెన్ తెలంగాణ : వినాయకచవితి స్పెషల్ స్వీట్స్..ఇంట్లోనే ఇలా ఈజిగా చేసేయచ్చు

మోదక్ లడ్డూ, దుర్వా గడ్డి, నెయ్యి మొదలైన వస్తువులు తప్పనిసరిగా సమర్పించాలి. ఈ వస్తువులు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనవని నమ్ముతారు. అలాగే ప్రతిరోజు వినాయకుడికి ఉదయం సాయంత్రం పూజ చేయాలి. ఈ సమయంలో ఇంట్లో అందరూ సాత్విక ఆహారమే తీసుకోవాలి

మేష రాశి: ఈ రాశికి చెందిన  వారు  ఇంట్లో ఎరుపు రంగు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి. విగ్రహాన్ని  ఎరుపు లేదా సింధూర రంగు వస్త్రాలతో అలంకరించాలి. పూజ చేసేటప్పుడు వినాయకుడికి బెల్లం, దానిమ్మ, ఎండు ఖర్జూరం, ఎర్ర గులాబీలు,  దుర్వాలతో చేసిన 11 లడ్డూలను సమర్పించాలి. పూజ చేసేటప్పుడు ఓం వక్రతుండాయ హుం నమం: అనే మంత్రాన్ని జపించాలి. 

వృషభ రాశి : ఈ రాశి వాళ్ళు ఇంట్లో నీలిరంగు గణపతి విగ్రహాన్ని ఉంచి తెల్లటి వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజ సమయంలో మోదకం, తెల్లటి పువ్వులు, పరిమళం,  కొబ్బరి లడ్డూలు సమర్పించాలి. ఓం హ్రీం గం హ్రీం అనే మంత్రాన్ని పాటించాలి

మిథున రాశి: మిథున రాశి వాళ్ళు ఆకుపచ్చ రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని తీసుకువచ్చి ...  ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించాలి. గజానుడి ఆరాధనలో మూంగ్ లడ్డూ,  తమలపాకులు, పచ్చి యాలకులు, దుర్వా, ఆకుపచ్చ పండ్లు, డ్రైఫ్రూట్స్ సమర్పించాలి. ఓం శ్రీ గం లక్ష్మినారాయణనమ:  అనే మంత్రాన్ని జపించాలి.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు తెల్లటి రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చి గులాబీ రంగు దుస్తులతో పూజించాలి. వినాయకుడి ఆరాధనలో గణేశుడికి మోదకం, బియ్యం పాయసం, వెన్న, గులాబీ పూలు సమర్పించాలి. ఓం ఏకదంతాయ హుం నమ:  అనే మంత్రాన్ని పఠించాలి. 

సింహ రాశి : సింహ రాశి వ్యక్తులు ఎరుపు రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఎర్రని వస్త్రాలతో  అలంకరించి పూజించాలి. పూజ సమయంలో బెల్లం లేదా బెల్లం మిఠాయిలు, గన్నేరు  పువ్వులు, ఎండు ఖర్జూరాలు మొదలైనవి సమర్పించాలి. ఓం శ్రీ గం సౌభాగ్య గణపతేయ వరవరదం సర్వజనం మేం వశమానాయ స్వాహా అనే మంత్రాన్ని పఠించాలి. 

కన్యా రాశి : ఈ రాశి జాతకులు ఇంట్లో ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజ సమయంలో ఆకుపచ్చ పండ్లు, లడ్డూలు, తమలపాకులు, పచ్చి యాలకులు, ఎండుద్రాక్ష, దుర్వా గడ్డి, డ్రైఫ్రూట్స్ సమర్పించాలి. ఓం గం గణపతయై నమః, ఓం శ్రీం శ్రియః నమః అనే మంత్రాలను పఠించాలి. 

తులా రాశి : ఈ రాశి వాళ్లు తెలుపు, నీలం రంగుల గణేష్ విగ్రహాన్ని వచ్చే తెల్లని వస్త్రాలతో అలంకరించాలి. ఆరాధన సమయంలో గణపతికి లడ్డూలు, అరటి పండ్లు, తెలుపు రంగు పూలు, పరిమళం, నెయ్యి సమర్పించాలి.  ఓం హ్రీం, గ్రీం, హ్రీం  విఘ్నేశ్వరామనమ: అనే మంత్రాన్ని జపించాలి. 

వృశ్చిక రాశి :  వృశ్చిక రాశి వారు ఇంట్లో ఎరుపు రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని ఉంచి ఎరుపు, కుంకుమ రంగు దుస్తులతో అలంకరించాలి. పూజలో బెల్లం లడ్డూలు, ఎండు ఖర్జూరాలు, దానిమ్మ, ఎర్ర గులాబీలు సమర్పించవచ్చు.  ఓం హ్రీం ఉమాపుత్రాయ నమః మంత్రాన్ని జపించాలి.

ధనుస్సు రాశి : ఈ రాశి వారు పసుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పసుపు వస్త్రాలతో అలంకరించాలి. పూజ సమయంలో పసుపు పువ్వులు, పసుపు రంగు మిఠాయిలు, మోదకం, అరటిపండు సమర్పించాలి.  హరిద్రరూప హుం గం గ్లౌం హరిద్రాగణపతయై వరవరద దుష్ట భ్రమణము భయ స్వాహా అనే మంత్రాన్ని జపించడం ఉత్తమం. 

మకర రాశి : మకర రాశికి చెందిన జాతకులు నీలం రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి నీలం రంగు దుస్తులతో అలంకరించుకోవాలి. వినాయకుడి ఆరాధనలో ఎండు ద్రాక్ష, తెల్లటి పువ్వులు, నువ్వుల లడ్డూలు, సింధూరం కలిపిన మల్లెనూనెను సమర్పించవచ్చు. ఓం లంబోదరాయ నమః మంత్రాన్ని జపించవచ్చు. 

కుంభ రాశి: కుంభ రాశి జాతకులు నీలిరంగు గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి నీలిరంగు వస్త్రాలతో అలంకరించాలి. అలాగే పూజ సమయంలో ఖోయాతో చేసిన ప్రసాదం, ఎండు ద్రాక్ష, ఆకుపచ్చ పండ్లు, తెల్లటి పువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు, సింధూరం కలిపిన మల్లె నూనె సమర్పించాలి. ఓం సర్వేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. 

మీన రాశి : ఈ రాశి వారు ఇంటికి ముదురు పసుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి పసుపు బట్టలతో అలంకరించాలి. బొజ్జ గణపయ్యని పూజించే సమయంలో పసుపు బట్టలు, పువ్వులు, బేసిన్ లడ్డూ, బాదం, పసుపు రంగు మిఠాయిలు, అరటిపండు సమర్పించాలి. ఓం సిద్ధి వినాయకాయ నమః మంత్రాన్ని జపించాలి