బస్సు సౌకర్యం కోసం ఎంపీకి వినతి

శివ్వంపేట, వెలుగు: మండలంలోని సికింద్లాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు గురువారం ఎంపీ రఘునందన్​ రావుకు వినతి పత్రం అందజేశారు. గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లాలన్నా, స్టూడెంట్స్​స్కూల్స్​కు వెళ్లాలన్నా  చాలా ఇబ్బందిగా ఉందన్నారు. దాదాపు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఆటోలు ఎక్కి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంజనేయులు, బీజేపీ అధ్యక్షుడు రవి పాల్గొన్నారు.