ఆలయంలో ఒకేసారి 90 మంది తలనీలాలు 

ఆలయంలో ఒకేసారి 90 మంది తలనీలాలు 

నిరుడు కరోనా వల్ల ఎంతోమంది చనిపోయారు. శ్మశానాలలో జాగా దొరకని పరిస్థితి ఎదురైంది. అలాంటి టైమ్​లో మధ్యప్రదేశ్​లోని నీముచ్​ జిల్లా దేవ్రీ ఖవాసా గ్రామంలో 25 నుంచి 30 మంది దాకా వైరస్​ బారిన పడ్డారు. దీంతో ఊరోళ్లు భయపడి.. అందరూ కోలుకుంటే తలనీలాలు ఇస్తమని ‘దేవ్​నారాయణ’ టెంపుల్​లో మొక్కుకున్నరు. డిసెంబర్​ 31న గ్రామానికి చెందిన 90 మంది ఇలా మొక్కు చెల్లించుకున్నరు. ఈ గ్రామ జనాభా 2,500 మంది. దేశంలో ఏ చిన్న ప్రాంతాన్ని వదలని వైరస్​ ఆ ఊరు కూడా పాకింది. దీంతో ఊరిలో చాలామంది వైరస్​ బారినపడ్డారు. అయితే ఏడాది కాలంలో కరోనాతో ఏ ఒక్కరూ చనిపోలేదు. దీంతో తమ ఆనందాన్ని వినూత్నంగా వ్యక్తం చేశారు. దేవ్​నారాయణ ఆలయంలో 90 మందికిపైగా దేవుడికి సామూహికంగా తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అన్నాదాన కార్యక్రమం నిర్వహించారు. దేవుడి పాటలకు నృత్యాలు చేశారు.