ఇసుక వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు

ఉప్పునుంతల, వెలుగు: రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తరలిస్తుండడంతో నిద్ర కరువవుతోందని ఆరోపిస్తూ గురువారం మండల కేంద్రంలో గ్రామస్తులు ఇసుక వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. పెద్దాపూర్, మొల్గర, జప్తిసదగోడు, ఉప్పునుంతల గ్రామాల్లో రోడ్డుకు దగ్గరగా ఉన్న ఇండ్లల్లో ఉంటున్న వారికి ప్రతిరోజు నిద్ర కరువవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వాహనాలు అధిక లోడ్ తో రాకపోకలు కొనసాగించడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు. 

అభివృద్ధి పనుల పేరుతో పర్మిషన్​ తీసుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. గృహ నిర్మాణాలకు పర్మిషన్  ఇవ్వకుండా తిప్పించుకుంటున్న ఆఫీసర్లు, ఇసుక మాఫియాకు, డబ్బులు ఇచ్చే వారికి మాత్రమే పర్మిషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.