విక్కల్స్ మ్యూజికల్స్

విక్కల్స్ మ్యూజికల్స్

జనాలను ఎంటర్​టైన్​ చేయడమే వాళ్ల లక్ష్యం. అందుకోసం ఏదో ఒక అంశాన్ని తీసుకుని దానికి కామెడీని యాడ్​ చేసి షార్ట్​ వీడియోలు చేస్తుంటారు. వాటిని ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​లో పోస్ట్​ చేస్తుంటారు. పాటలు వింటున్నప్పుడు చాలామందికి.. సింగర్​ ఇక్కడ లో పిచ్​లో ఎందుకు పాడింది. ఈ బిట్​ పాడేటప్పుడు మ్యూజిక్​ ఎందుకు ఇలా ఉంది?... ఇలాంటి డౌట్స్​ వస్తుంటాయి.  అలాంటి అంశాల నుంచి కామెడీ పుట్టించేందుకు ‘విక్కల్స్’ యూట్యూబ్​ ఛానెల్​ టీమ్​ పాటల రికార్డింగ్​ సెషన్లను రీ క్రియేట్​ చేస్తుంటారు. ఇదొక్కటే కాదు లైఫ్​లో జరిగే ఇన్సిడెంట్లలో కామెడీ పాయింట్​ని వెతికి దాని మీద రీల్స్​ చేస్తుంటారు. అందుకే మిలియన్ల వ్యూస్​, లక్షల మంది అభిమానం సొంతం చేసుకున్నారు. 

తమిళ సినిమా పాటల్లో వాడిన కొన్ని ట్యూన్స్​ని, పదాలను అక్కడ ఎందుకు వాడారు? అనేదానికి కామెడీ సిద్ధాంతాలు చెప్తున్నారు విక్కల్స్​ యూట్యూబ్​ ఛానెల్​ టీమ్​ మెంబర్స్. ఈ ఛానెల్​ని స్టాండప్​ కమెడియన్, థియేటర్ ఆర్టిస్ట్ ​ విక్రమ్​ ఉరుల్ విద్యాపతి నడుపుతున్నాడు. వీడియోల్లో కోయంబత్తూరుకు చెందిన తన ఫ్రెండ్స్ హరి మునియప్పన్, సిబి జయకుమార్​తోపాటు మరికొంత మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్​ కనిపిస్తుంటారు. ఛానెల్​లో దాదాపు అన్ని రకాల కామెడీ వీడియో షార్ట్స్​ని అప్​లోడ్​ చేస్తున్నారు. కామెడీ రోస్ట్​ల నుంచి పేరడీ వీడియోల వరకు అన్ని ఉంటాయి. ప్రస్తుతం ఈ ఛానెల్​కు 1.06 మిలియన్ల సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. 
ముఖ్యంగా పాటల నుంచి కొన్ని సందర్భాలను ఎంచుకుని వాటిని కామిక్ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఊహించి రికార్డింగ్ స్టూడియోలో రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు బాగా వైరల్​ అయ్యాయి. దాదాపు సౌత్​ ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ఈ షార్ట్స్​ చూశారు. ‘నిలవై కొండు వా’ పాట రికార్డింగ్ చేసేటప్పుడు ఉన్నికృష్ణన్ బాగా జ్వరంతో ఉండడంతో మెల్లిగా పాడినట్టు ఒక రీల్​లో  చూపించారు. అది చాలామందికి నచ్చింది. ‘పాల పాలకూర’లో ‘ఆహాన్’ అనే పదం మీద కూడా షార్ట్​ వీడియో చేశారు. కంపోజర్​ హారిస్ జయరాజ్ సింగర్​ హరిహరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్నాక్స్ తినిపిస్తున్నారని అందుకు ఆయన నో చెప్పే ఉద్దేశంతో పాట మధ్యలో ‘ఆహాన్’ అన్నట్టు చూపించారు. ఈ వీడియోకు 11 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. 
పాటలతోనే వైరల్ 
విక్రమ్​ 2019లో విక్కల్స్​ ఛానెల్​ పెట్టి, వీడియోలు అప్​లోడ్ చేశాడు. కానీ.. పెద్దగా రీచ్​ రాలేదు. వీడియోలకు వ్యూస్​ వచ్చేవి కాదు. అప్పటికే ఆయన స్టాండప్​ కమెడియన్​గా చాలామందికి తెలుసు. అయినా.. ఛానెల్​కు మాత్రం గ్రోత్​ లేదు. 2021లో రీల్స్​ చేయడం మొదలుపెట్టాడు. అయినా పెద్దగా వైరల్​ కాలేదు. కానీ.. రికార్డింగ్​ సెషన్​ వీడియోలు చేయడం మొదలుపెట్టగానే వీడియోలు వైరల్​ అయ్యాయి. ఛానెల్​ గురించి అందరికీ తెలిసింది. ముఖ్యంగా కామెడీ షార్ట్స్ సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. కాన్సెప్ట్​ కొత్తగా ఉండడంతో వీడియోలు చూసినవాళ్లు చాలామంది మెచ్చుకున్నారు. అంతకుముందు చేసిన వీడియోల వ్యూస్​ పదివేలకు మించలేదు. షార్ట్స్​ వైరల్ అయ్యాక మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. ‘షార్ట్​ వీడియోలు ఇచ్చిన సక్సెస్​తో వంద రోజుల పాటు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతిరోజూ ఒక రీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకోసం రకరకాల టెంప్లేట్స్​ రెడీ చేసుకున్నాం. దాంతో ఖాళీగా ఉన్నప్పుడల్లా మా ఫ్రెండ్​ రికార్డింగ్ స్టూడియోకి వెళ్లి అక్కడ రీల్స్ చేశాం. కానీ.. వాటిని ఎడిట్​ చేయడం చాలా కష్టమైంది. అందుకే షూటింగ్​కు తక్కువ టైం కేటాయించాం. గంటలోపు షూటింగ్ పూర్తి చేయగల కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లనే ఎంచుకున్నాం’ అని రీల్స్​ జర్నీ చెప్పుకొచ్చాడు విక్రమ్. 
నన్నారే
2007లో విడుదలైన గురు సినిమాలో నన్నారే.. పాట చాలా ఫేమస్ అయ్యింది. ఆ పాటకు చాలామంది స్టేజీల మీద డ్యాన్స్​లు చేశారు. అయితే.. అదే పాటకు  90ల్లో యాన్వల్ డేస్​ అప్పుడు స్టూడెంట్స్​ డ్యాన్స్​ చేస్తే ఎలా ఉంటుందో షార్ట్​ వీడియో ద్వారా చూపించారు. ఈ వీడియో కూడా బాగా వైరల్​ అయ్యింది. దీనికి దాదాపు 25 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. 
“విక్కల్స్​ వీడియోల్లో కులతత్వం, లింగ వివక్ష లాంటి ఎన్నో విషయాలను టచ్​ చేశాం. బలమైన థీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో వీడియోలు చేశాం. కానీ.. అవి ఎవరినీ ఉద్దేశించినవి కావు. రికార్డింగ్ వీడియోల ద్వారా తమిళ కంపోజర్లు, సింగర్లను బాధపెట్టడం, కించపరచడం మా ఉద్దేశం కాదు. కేవలం నవ్వుకోవడానికి మాత్రమే అలా చూపించాం”అంటున్నాడు విక్రమ్.
సెలబ్రిటీల సపోర్ట్​ 
విక్కల్స్​ టీం కష్టానికి తక్కువ టైంలోనే ఫలితం దక్కింది. వాళ్ల షార్ట్​ వీడియోలు తమిళ డైరెక్టర్లు, సింగర్స్​ని కూడా ఆకట్టుకున్నాయి. యాక్టర్​ ఎస్​జే  సూర్య, సింగర్స్​ జీవీ ప్రకాష్, బెన్నీ దయాల్, స్టాండ్-అప్ కామిక్ ఎస్​ఏ అరవింద్ వీళ్ల వీడియోలకు స్పందించారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటుడు సిద్ధార్థ్ లాఫింగ్ ఎమోజీలను వాడి రీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రియాక్ట్​ అయ్యారు. సంగీత దర్శకుడు దేవా విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రీల్ “చాలా న్యాచురల్​గా ఉంద’’ని చెప్పాడు. నటి సిమ్రాన్ తన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను షేర్ చేసింది. వాస్తవానికి తన షార్ట్​ వీడియోలకు ఇంతలా రీచ్ ఉంటుందని విక్రమ్​ కూడా ఊహించలేదు. పైగా సెలబ్రిటీలు సపోర్ట్​ చేస్తారని అస్సలు అనుకోలేదు.