ఉత్సాహంగా 3కె రన్, సైకిల్​ ర్యాలీ

ఉత్సాహంగా 3కె రన్, సైకిల్​ ర్యాలీ

వికారాబాద్, వెలుగు: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి చెక్ పోస్ట్ పాయింట్ నుంచి హరిత రిసార్ట్స్ వరకు సైకిల్ ర్యాలీ, 3కె రన్ నిర్వహించారు. ఎస్పీ నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. యువకులు, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు కలిపి 450 మంది వరకు పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు అండగా ఉందామని ఎస్పీ నారాయణరెడ్డి చెప్పారు.