రైల్వే సంచాలన్ భవన్లో విజయ డెయిరీ పార్లర్

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే సంచాలన్​భవన్​లో కొత్తగా ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్ ను డెయిరీ చైర్మన్​గుత్తా అమిత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాల ఉత్పత్తుల అమ్మకాలు పెంచడానికి పార్లర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

వీటి ద్వారా విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట, వరంగల్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో విజయ డెయిరీ పార్లర్లు సక్సెస్​ఫుల్​గా నడుస్తున్నాయని చెప్పారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలిని జైన్, డివిజనల్ రైల్వే మేనేజర్ భర్తేశ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.