న్యూఢిల్లీ: పేటీఎం షేర్లను కంపెనీ ప్రమోటర్ విజయ్ శేఖర్ శర్మ కొనుగోలు చేయడంతో పేటీఎం షేరు శుక్రవారం సెషన్‌లో 5 శాతం మేర పెరిగింది. మొత్తం రూ. 11 కోట్లు పెట్టి 1.7 లక్షల షేర్లను విజయ్ శేఖర్ శర్మ కొనుగోలు చేశారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వన్97 కమ్యూనికేషన్ (పేటీఎం పేరెంట్ కంపెనీ) పేర్కొంది. ఈ ఏడాది మే 30, 31 న ఆయన పేటీఎం షేర్లను కొన్నారు. మే 30 న రూ.6.31 కోట్లు పెట్టి 1,00,552 షేర్లను, 31 న రూ. 4.68 కోట్లు పెట్టి 71,469 షేర్లను విజయ్ శేఖర్ శర్మ కొనుగోలు చేశాడని వన్97 కమ్యూనికేషన్ వెల్లడించింది. పేటీఎం షేరు శుక్రవారం 5.27 శాతం పెరిగి ఎన్‌ఎస్‌ఈలో రూ. 646 దగ్గర ముగిసింది.
