ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర ఏ మంత్రం ఉంటుందో తెలియదు గానీ ఫామ్ లో లేని ఆటగాడు కూడా చెలరేగుతాడు. రాయుడు, అజింక్య రహానే, శివమ్ దూబే లాంటి ఆటగాళ్లు గతంలో గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారు. అయితే చెన్నై జట్టులోకి వచ్చిన తర్వాత వారి తలరాత మారిపోయింది. ధోనీ ఆధ్వర్యంలో అద్భుతంగా ఆడుతూ రాటు దేలారు. తాజాగా ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకముందు తమిళ నాడు ఆల్ రౌండర్ బ్యాటింగ్ లో చెలరేగిపోయాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024-25 ట్రోఫీలో బరోడా, తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 22 బంతుల్లో 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్య బౌలింగ్ లో ఒకే ఓవర్ లో మూడు సిక్సర్లు బాదడం తమిళనాడు ఇన్నింగ్స్ కే హైలెట్ గా మారింది. ఐపీఎల్ కు ముందు శంకర్ రెచ్చిపోవడంతో చెన్నై ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. శంకర్ (44)తో పాటు ఎన్ జగదీశన్ (57), బాబా ఇంద్రజిత్ (25), బూపతి కుమార్ (28), కెప్టెన్ షారుక్ ఖాన్ (39) జట్టు భారీ స్కోర్ సాధించడంలో భాగమయ్యారు. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య 3 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో విజయ్ శంకర్ రూ. 1.2 కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
Vijay Shankar hits 6, 6, 1, 6 off Hardik Pandya in Syed Mushtaq Ali ?pic.twitter.com/E1vTndj25T
— GBB Cricket (@gbb_cricket) November 27, 2024