విజయ్ మాల్యా భారత్ కు వచ్చేనా..?

విజయ్ మాల్యా భారత్ కు వచ్చేనా..?

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను అప్పగించే కేసు విషయంపై స్టేటస్ రిపోర్ట్ ను సమర్పించాలని సుప్రీంకోర్ట్ కేంద్రానికి సూచించింది.

యూకేలో ఉన్న విజయ్ మాల్యాను తిరిగి భారత్ కు తెచ్చే అంశంపై సుప్రీం కోర్ట్ లో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈకేసుకు సంబంధించి రిపోర్ట్ ను తయారు చేసి 6 వారాల్లోగా కోర్ట్ కు సమార్పించాలని అత్యున్నత న్యాయ స్థానం తెలిపింది.

ఈ విచారణలో విజయ్ మాల్యా స్వదేశానికి రాకుండా తప్పించుకునేందుకు యూకే కోర్ట్ లో రహస్యంగా చర్చలు జరుపుతున్నారని కేంద్రం..,సుప్రీం కోర్ట్ తెలిపింది. ఇందుకు సంబంధించి తాము గతంలోనే కేసుకు సంబంధించి ఓ రిపోర్ట్ ను తయారు చేశామని..ఆ రిపోర్ట్ ను లండన్ కోర్ట్ లో సమర్పించినట్లు వెల్లడించింది.  కానీ మాల్యా కోర్ట్ ను ప్రభావితం చేశారు. అందుకే లండన్ కోర్ట్ సైతం మాల్యాను తిరిగి భారత్ కు పంపించేందుకు ఒప్పుకోలేదన్న విషయాన్ని కోర్ట్ కు విన్నవించుకున్నారు.

అంతేకాదు మాల్యా భారత్ కు రావాలంటే చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిపై పూర్తి స్పష్టత వచ్చే వరకు ఎదురు చూడాల్సిందేనంటూ బ్రిటిష్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును కేంద్రం సుప్రీంకోర్ట్ లో తెలిపింది.అయితే ఈ కేసు స్పష్టత కోసం సంబంధిత రిపోర్ట్ ను తయారు చేసి కోర్ట్ కు సమ్మిట్ చేయాలని సుప్రీం కోర్ట్ కేంద్రానికి సూచించింది.