మెరిసిన తనయ్‌‌, అనికేత్‌‌.. అరుణాచల్‌‌పై హైదరాబాద్ గెలుపు

అహ్మదాబాద్‌‌: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌‌ను హైదరాబాద్ విజయంతో ముగించింది. స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్ (5/32), అనికేత్ రెడ్డి  (4/14) విజృంభించడంతో  ఆదివారం జరిగిన గ్రూప్‌‌–సి చివరి మ్యాచ్‌‌లో 8 వికెట్ల తేడాతో అరుణాచల్ ప్రదేశ్‌‌ను చిత్తు చేసింది. ఏకపక్ష మ్యాచ్‌‌లో తొలుత అరుణాచల్ జట్టు 28.3 ఓవర్లలో 96 రన్స్‌‌కే కుప్పకూలింది.

సిద్దార్థ్‌‌ బలోడి (29) టాప్ స్కోరర్.  ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌ 12 ఓవర్లలోనే 100/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. నితేశ్ రెడ్డి (29 నాటౌట్‌‌), తన్మయ్ (22), హిమతేజ (21 నాటౌట్‌‌) రాణించారు. తనయ్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.  ఏడు మ్యాచ్‌‌ల్లో 4 విజయాలులు సాధించిన హైదరాబాద్ 16 పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌తో నాకౌట్‌‌ చేరలేకపోయింది.