సీనియర్ సినీ నటుడు విజయ చందర్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. సినిమాల్లో కరుణా మయుడిగా, సాయిబాబాగా నటించి మెప్పించిన నటుడు విజయ్ చందర్. అంతేకాదు మొదటి నుంచి జగన్ పార్టీకి జగన్ కు ఉండగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం మొదటి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులుకు మనవడు విజయ్ చందర్.

