UI vs Vidudala 2: ఉపేంద్ర‌, విజ‌య్ సేతుప‌తి సినిమాల బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయంటే?

ప్రతి శుక్రవారం తెలుగు సినిమాల సందడి గట్టిగానే ఉటుంది. గడిచిన శుక్రవారం డిసెంబర్ 20న మాత్రం డబ్బింగ్ సినిమాల జోరు థియేటర్లో హోరెత్తింది. ఓ వైపు నేషనల్ అవార్డు డైరెక్టర్ వెట్రిమారన్ రూపొందించిన విడుదల పార్ట్ 2 ఉంటే, మరోవైపు వర్సటైల్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర తెరకెక్కించిన UI ఉంది. ఈ రెండు సినిమాలు కథలు వేరైనా, అంచనాలు మాత్రం ఒకేలా ఉన్నాయి. రిలీజ్ అయ్యాక..ఈ రెండు సినిమాలకి ఎటువంటి కలెక్షన్స్ వచ్చాయి.. ఆడియన్స్ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారో చూద్దాం.. 

లహరి ఫిలింస్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్ నిర్మించిన UI మూవీ డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఇంకో పదిరోజుల వరకు మంచి కలెక్షన్స్ రాబడుతుంది ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే,  యూఐ క‌న్న‌డంలో భారీగా కలెక్షన్స్ వస్తున్నప్పటికీ, తెలుగులో మాత్రం అంచనాలు అందుకోలేకపోతుంది. విజ‌య్ సేతుప‌తి విడుదల2 సైతం తెలుగులో మాత్రం పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోతుంది.

Also Read:-ఫస్ట్ హాఫ్ అద్భుతం.. రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కా..

Sacnilk బాక్సాఫీస్ ప్రకారం.. 

క‌న్న‌డంలో యూఐ మూవీ రెండు రోజుల్లో రూ.13.50 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగులో మాత్రం ఫస్ట్ డే రూ.80 ల‌క్ష‌లు, సెకండ్ డే రూ.65 ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఓవరాల్ గా ఇండియా వైడ్ నెట్ కలెక్షన్స్ చూసుకుంటే.. 

యూఐ ఇండియా నెట్ కలెక్షన్స్:

ఫస్ట్ డే (శుక్రవారం) రూ.6.95 కోట్లు
సెకండ్ డే (శనివారం) రూ.5.6 కోట్లు 
థర్డ్ డే (ఆదివారం) రూ.5.79 కోట్లు. ఇలా ఇండియా బాక్సాఫీస్ అంచనాల ప్రకారం.. మూడు రోజుల మొత్తం రూ.18.34 కోట్లు రాబట్టింది.

విడుదల పార్ట్ 2:

ఈ మూవీ తమిళంలో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. అన్నిచోట్లా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ మూవీ రెండ్రోజుల్లోనే రూ.15కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే రూ.7.50 కోట్లు, సెకండ్ డే రూ.8కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. 

ఇండియా నెట్ కలెక్షన్స్:

ఫస్ట్ డే (శుక్రవారం)] రూ.7.5 కోట్లు ఇందులో తమిళంలో రూ.7 కోట్లు, తెలుగులో రూ.50 లక్షలు చేసింది. 
సెకండ్ డే (శనివారం) రూ.7.7 కోట్లు ఇందులో తమిళంలో రూ. 7.2 కోట్లు, తెలుగులో రూ.50 లక్షల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. 
థర్డ్ డే (ఆదివారం) రూ.7.60 కోట్లు. ఇక మూడు రోజుల మొత్తం రూ.22.80 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.