ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు నెలరోజుల సమయం కూడా లేకపోవటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కో ఆర్డినేటర్ కోనేరు సురేష్, ఓ ప్రెజెంటేషన్ ఇస్తూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ 147సీట్లతో అధికారంలోకి రానుందని చెప్పటం హాట్ టాపిక్ గా మారింది.
వైయస్ఆర్ సీపీ గెలుస్తుంది అని తేల్చేసిన టీడీపీ???
— Rahul (@2024YCP) April 20, 2024
147 నియోజకవర్గాల్లో 2% ఓట్లతో వైసీపీనే ముందంజలో ఉంది.
28 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా కూడా వైసీపీ 10 లక్షల ఓట్ల ముందంజలో ఉంది.
-TDPస్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ pic.twitter.com/tGOgv59oJh
వివరాల్లోకి వెళితే, 147 నియోజకవర్గాల్లో 2శాతం ఓట్ల తేడాతో వైసీపీనే ముందంజలో ఉందని తేలినట్లు వివరిస్తున్నారు సురేష్. 28 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా కూడా వైసీపీ 10లక్షల ఓట్లతో ముందంజలో ఉందని అంటున్నారు. ఈ వీడియోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేస్తున్నారు. ఏ మాటకా మాట, ఎన్నికల పట్ల రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఈ వీడియో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిందని చెప్పాలి. మరి, ప్రతిపక్ష టీడీపీ దీనిని ఎలా డిఫెన్స్ చేసుకుంటుందో వేచి చూడాలి.