OTT Triptii Dimri: ఓటీటీకి యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ.. భార్యాభర్తల ఫస్ట్ నైట్ వీడియో మిస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యానిమల్(Animal) సినిమాతో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri). నిజానికి ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది కానీ, ఆమెకన్నా ఎక్కువ క్రేజ్ త్రిప్తి కి రావడం విశేషం. 

ఇదిలా ఉంటే.. ఇటీవలే త్రిప్తి నటించిన బోల్డ్ మూవీ 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video) ఓటీటీకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నేడు (డిసెంబర్ 7) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ వీడియో రిలీజ్ చేస్తూ ఆఫిషియల్గా అనౌన్స్ చేసింది.

స్త్రీ 2 లో హీరోగా నటించిన స్టార్ యాక్టర్ రాజ్ కుమార్ రావు, గ్లామర్ బ్యూటీ మల్లికా షెరావత్  ఇందులో కీ రోల్ ప్లే చేశారు. అక్టోబర్ 11న రిలీజైన ఈ మూవీ నేడు ఓటీటీకి రావడంతో త్రిప్తి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాని దాదాపు రూ.35-40 కోట్లతో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద రూ. 55 కోట్లకి పైగా సాధించింది.

Also Read:-ఇది కదా మక్కల్ క్రేజ్ అంటే.. చైనాలో రికార్డ్ వసూళ్లతో మహారాజ మూవీ..

ఇకపోతే ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లిచేసుకున్న హీరో హీరోయిన్స్ ఫస్ట్ నైట్ మెమొరీగా ఉండాలని వీడియో రికార్డ్ చేసి ఓ సీడీలో భద్రపరుస్తారు. అయితే, హీరో హీరోయిన్లు ఇంట్లో లేని టైంలో దొంగలు పడతారు. అందులో భాగంగా దొంగలు ఆ సీడీని కూడా ఎత్తుకెళ్లిపోతారు. దీంతో అది కనుక బయట పడితే.. ఇక అంతే సంగతి అనుకుని తెగ టెన్షన్ పడుతుంటారు. ఒకవేళ తమ ప్రైవేట్ వీడియో కనుక ఎవరైనా చూశారా? లేక ఇప్పుడు అదెక్కడ ఉంది? అని వెతికే పనిలో పడతారు. చివరికి అది వారికి దొరికిందా లేదా అనేది మెయిన్ స్టోరీ.

యానిమల్లో త్రిప్తి చేసింది చిన్న పాత్రే అయినా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక గ్లామర్ విషయంలో మాత్రం అస్సలు వెనుకాడలేదు. ముద్దు, సీడ్ సీన్స్లో రెచ్చిపోయింది దీంతో 2024కి గాను IMDB లో మోస్ట్ సెర్చింగ్‌‌ హీరోయిన్‌‌గా క్రేజ్ అందుకుంది. ఇక ఈ సినిమాలో కూడా బొల్డ్ సీన్స్తో దుమ్ము రేపింది త్రిప్తి.