తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కమల్ హాసన్ కు షాక్ తగిలింది. బీజేపీ దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి పుట్టిన రోజు సందర్భంగా కమలం నేతలు తమిళనాడులో పుట్టిన రోజుల వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కమల్ హాసన్ కు షాకిస్తూ ఎంఎన్ఎం పార్టీ వైస్ ప్రెసిడెంట్ అరుణాచలంకు కండువా కప్పి పార్టీలకి ఆహ్వానించారు.
నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. ప్రధాని మోడీ, హోం మినిస్టర్ అమిత్ షా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు ఎంత ఉపయోగకరమో నాకు బాగా తెలుసు. నేను మక్కల్ నీది మయ్యమ్ పార్టీ నేతలతో, హైకమాండ్ తో వాదించాను . కేంద్రప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు ఎంతో ఉపయోగకరమని, వాటికి సపోర్ట్ చేయాలని కోరా. కానీ వాళ్లు దాన్ని తిరస్కరించారు.
అనేక సందర్భాల్లో కేంద్రం అమలు చేసిన చట్టాల్ని బీజేపీ పార్టీకి ఆపాదించవద్దని, ఆ చట్టాలు కేవలం రైతుల కోసమని వాదించా. మనం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే ప్రతిపక్ష పార్టీకి – అధికార పార్టీకి మధ్య తేడా ఏం ఉండదన్నా. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. రైతుల్ని వ్యతిరేకించే పార్టీలో నేను ఉండదలుచోలేదని మాజీ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అరుణాచలం అన్నారు.
