సేంద్రీయ పద్దతులు బాగున్నయ్..రైతులకు ఉపరాష్ట్రపతి కితాబు

మెదక్ : సేంద్రియ సాగుకు ఇక్కడి రైతులు అపలంభిస్తున్న పద్దతులు బాగున్నాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు.  సేంద్రియ ఎరువులను రైతులే స్వయంగా తయారు చేయ సుకోవడం గొప్ప విషయం.. మారిపోతున్న జీవనశైలి చాలా రోగాలకు కారణమవుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో సేంద్రియ వ్యవసాయం తప్పనిసరి అవుతోంది. ఇక్కడి రైతుల చైతన్యాన్ని ఇతర రైతులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులందరూ సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి. మంచి ఫలితాలు సాధించవచ్చు. కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది.' అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కితాబిచ్చారు.

Also Read : సహారా బాధితులకు డబ్బులు పడేది ఎప్పుడో చెప్పిన కేంద్ర ప్రభుత్వం

 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి మరియు సేంద్రియ రైతుల సమ్మేళనంలో గవర్నర్ బిష్ణు దేవ్ వర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి, గవర్నర్ కు  మంత్రి కొండా సురేఖ పూలబొకే అందించి ఘన స్వాగతం తెలిపారు. రైతులు ఏర్పాటు చేసిన సేంద్రియ పంటలు స్టాల్స్ను, సేంద్రియ ఎరువులతో పండించిన కూరగా యలు, పండ్లను వారు పరిశీలించారు. పలు విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటల సాగును పరిశీలించారు. పలు విషయాలను వారి నుంచి రాబట్టారు. రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడారు. గిరిజనులతో కలిసి డ్యాస్సులు చేశారు. ఇదే స్ఫూర్తిని మిగితా రైతులు పాటించాలన్నారు.