కన్హా శాంతివనానికి ఉప రాష్ట్రపతి ఫ్యామిలీ

షాద్ నగర్, వెలుగు: దేశంలోనే ఒక అత్యుత్తమైన, ఆదర్శప్రాయమైన పర్యావరణ సంస్థ కన్హా శాంతి వనమని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్​అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చేగూరులో ఉన్న కన్హా శాంతి వనానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ఆయన సతీమణి సుదేశ్ ధన్కర్ విచ్చేశారు.ఈ సందర్భంగా రామచంద్ర మిషన్ ప్రెసిడెంట్ ధాజి వారిని సాదరంగా ఆహ్వానించారు. 

తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ కన్హా శాంతి వనం అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఆదర్శప్రాయమైన పర్యావరణ వ్యవస్థగా కూడా నిలుస్తుందన్నారు. వచ్చిన ప్రతిసారి చాలా నేర్చుకుంటున్నానని, దాజీ జ్ఞానం, శాంతికి దూత అని కొనియాడారు.