పిల్లలను గవర్నమెంట్​ స్కూళ్లలోనే చదివించాలి : వైస్  ఎంపీపీ వెంకట్ రెడ్డి

మద్దూరు, వెలుగు : పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని వైస్  ఎంపీపీ వెంకట్ రెడ్డి సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెదిరిపాడ్  జడ్పీ హైస్కూల్ లో గురువారం అమ్మ ఆదర్శ స్కూల్ కమిటీ చైర్మన్లు లలిత, మల్లమ్మ ఆధ్వర్యంలో హెచ్ఎం బాలకిష్టప్ప అధ్యక్షతన బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

ఈ నెల 12 నుంచి స్కూళ్లు రీ ఓపెన్  కానున్న నేపథ్యంలో మౌలిక వసతుల పనులు కంప్లీట్​ చేయాలన్నారు. బాలప్ప, మహమ్మద్, వెంకట్రాములు, శ్రీనివాస్, రామంజనేయులు, రఘురాములు పాల్గొన్నారు.