దెబ్బతిన్న కట్టకు మరమ్మతులు చేపట్టండి : దుర్గయ్య

ఆమనగల్లు, వెలుగు:  ఆమనగల్లు లోని సురసముద్రం బతుకమ్మ ఘాట్ తూము వద్ద మట్టి కొట్టుకుపోయి దెబ్బతిన్న కట్టకు మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య అధికారులకు సూచించారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ వసంత,ఇరిగేషన్ అధికారులతో కలిసి కట్టను పరిశీలించారు. 

అంతకుముందు రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని అండర్​ గ్రౌండ్​డ్రైనేజీ లోకి ఇసుక చేరి నీరు రోడ్లపై పారుతుండడంతో ప్రత్యేక శానిటేషన్ నిర్వహించి ఇసుకను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా కట్టపై మట్టి కొట్టుకుపోయిన ప్రాంతాల్లో రిపేర్లు చేపట్టాలని అధికారులను కోరారు.  కౌన్సిలర్లు విజయకృష్ణ, జ్యోతి నరసింహ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.