హైదరాబాద్, వెలుగు : డేటా సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే బ్యాకప్, రికవరీ డేటా మేనేజ్‌మెంట్ కంపెనీ వీయం సాఫ్ట్‌వేర్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. క్లౌడ్, వర్చువల్ నెట్వర్క్స్, సాఫ్ట్‌వేర్ యాజ్ సర్వీస్, కుబెర్‌నెట్స్, ఫిజికల్‌లో లేటెస్ట్ డేటా సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను హైదరాబాద్ మార్కెట్‌కు పరిచయం చేసింది. వీయం ఇటీవల ‘హోప్ ఆన్ వీయంః యువర్ జర్నీ టు మోడ్రన్ డేటా ప్రొటెక్షన్’ పేరుతో మల్టీ సిటీ రోడ్ షోలను నిర్వహిస్తోంది. ఈ వెహికల్ ద్వారా వీయం పార్ట్నర్లు, కస్టమర్లు, డిస్ట్రిబ్యూటర్లు డేటా ప్రొటెక్షన్‌పై చర్చించడం వీలవుతుంది. హోప్ ఆన్ వీయం బస్‌లో ల్యాబ్ ఉంటుంది. ఏడబ్ల్యుఎస్, అజూర్, గుగూల్ క్లౌడ్ , మైక్రోసాఫ్ట్ 365 కోసం సాస్ ఆఫరింగ్స్, కంటిన్యూస్ డేటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్ (సీడీపీ), వీయం డిజాస్టర్ రికవరీ ఆర్కెస్ట్రార్ (వీడీఆర్‌ఓ), వీయం క్లౌడ్ కనెక్ట్ , ఎన్‌ఏఎస్ బ్యాకప్ కోసం ఇన్‌స్టెంట్ రికవరీ వంటివి ఇంజనీర్లు ప్రదర్శిస్తారు.
