న్యూఢిల్లీ: మన దేశంలోని యువ ముస్లిం నేతలు ప్రధాని పదవిని చేపట్టడం కష్టతరమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇప్పట్లో ఒక ముస్లిం లీడర్ ప్రధాని పీఠాన్ని చేపట్టడం సుసాధ్యం కాదని, అందుకు మరికొన్ని దశాబ్దాలు పట్టొచ్చునని ఆయన చెప్పారు. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న ఆజాద్.. రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నారు. సభలో ఫేర్వెల్ స్పీచ్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ ముస్లిం అయినా గర్వంగా ఉంటే వారు కచ్చితంగా భారతీయ ముస్లింలే అయి ఉంటారని చెప్పారు.
