రైల్లో రగడ: భార్య భర్తలపై చిరు వ్యాపారుల దాడి..

రైలులో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులతోనూ.. భిక్షాటనకు వచ్చే యాచకులతోనూ చిన్న చిన్న చికాకులు సహజం. అయితే.. ఒక్కోసారి అవి చిలికి చిలికి గాలివానగా మారుతుంటాయి. ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణికులపై చిరువ్యాపారస్తులు దాడి చేసిన ఘటన మదనపల్లిలో ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం ( అక్టోబర్ 28, 2024 ) తిరుపతి నుండి గుంతకల్ కు వెళ్తున్న రైల్లో చోటు చేసుకుంది ఈ ఘటన. ప్రయాణికులకు చిరువ్యాపారస్తులకు మధ్య.. చిన్నపాటి తగాదాతో మొదలైన గొడవ ప్రయాణికులపై దాడికి దారి తీసింది.

ALSO READ : జిమ్‌ ట్రైనర్‌తో వివాహేతర సంబంధం.. శవమై కనిపించిన వ్యాపారవేత్త భార్య

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన సురేష్, రేణుక దంపతులు తిరుపతికి వచ్చి వెళుతుండగా రైల్లోని చిరువ్యాపారులతో వాగ్వాదం మొదలైంది.చిన్నపాటి తగాదాతో మొదలైన గొడవ కాస్తా పెద్దదిగా మారడంతో చిరువ్యాపారస్తులంతా ఒక్కటై.. సురేష్, రేణుకల మీద దాడికి దిగారు. ఈ ఘటన ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసింది.