రాజన్న హుండీ ఆదాయం రూ.1.27 కోట్లు

వేములవాడ, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి హుండీ లెక్కింపులో భారీగా అదాయం సమకూరింది. మంగళవారం ఆలయ ఓపెన్  స్లాబ్ లో పోలీసులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు.

Also Read :- పంచాయతీరాజ్​లో ఈ–ఆఫీస్! సర్క్యులర్లు, జీవోలన్నీ ఆన్​లైన్​లోనే..

26 రోజులకు గాను రూ.1,27,46,977 నగదు, 395 గ్రాముల బంగారం, 8 కిలోల 100 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపులో ఈవో వినోద్ రెడ్డి, అసిస్టెంట్​ కమిషనర్​ ఆఫీస్​ సూపరింటెండెంట్​ సత్యనారాయణ, ఏఈవోలు పాల్గొన్నారు.