బీపీసీఎల్‌ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తం

బీపీసీఎల్‌ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తం

వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌ పెట్రోలియం (బీపీసీఎల్‌‌‌‌) ను కొనుగోలు చేసేందుకు రూ. 88 వేల కోట్ల (12 బిలియన్ డాలర్ల) వరకైన ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నామని వేదాంత గ్రూప్‌‌‌‌ ప్రకటించింది. ‘బీపీసీఎల్‌‌‌‌ కోసం మేము దూకుడుగా బిడ్స్ వేయం. కానీ, సరియైన ధరనే కోట్ చేస్తాం’ అని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. బీపీసీఎల్ మార్కెట్ క్యాప్ 11 –12 బిలియన్ డాలర్లు ఉంటుందని, ఈ అమౌంట్‌‌‌‌నే ఇన్వెస్ట్‌‌‌‌ చేయాలనుకుంటున్నామని చెప్పారు. 

కాగా, బీపీసీఎల్‌‌‌‌ సేల్ చేయాలని గత కొన్ని నెలల నుంచి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఇన్వెస్టర్లకు పార్టనర్లు దొరకకపోవడమో లేదా ఇతర కారణాల వల్ల ఈ ప్రాసెస్ ముందుకు సాగడం లేదు. కిందటేడాది సెప్టెంబర్ నాటికే బీపీసీఎల్ సేల్ ప్రాసెస్ పూర్తి కావాల్సి ఉంది. తాము రెడీగా ఉన్నామని, డీల్ వస్తే తమ పార్టనర్లు డబ్బులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అగర్వాల్ పేర్కొన్నారు. కాగా, లండన్ కంపెనీ సెంట్రికస్‌‌‌‌ అసెట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌తో కలిసి అగర్వాల్ కంపెనీ వేదాంత బీపీసీఎల్‌‌‌‌ కోసం బిడ్డింగ్ వేయనుందని అంచనా.