అత్తగారింట్లో ఆత్మహత్య

అచ్చంపేట, వెలుగు: మండలంలోని రంగాపూర్​ గ్రామంలో ఆదివారం బల్మూర్​ మండలం గోదల్ గ్రామానికి చెందిన వావిలాల సుభాశ్​రెడ్డి(35) ఒంటిపై పెట్రోల్​ పోసుకొని సూసైడ్​ చేసుకున్నాడు. రంగాపూర్​ గ్రామానికి చెందిన లోహితతో ఏడాది కింద వివాహం జరిగింది. మనస్పర్థలు రావడంతో లోహిత రంగాపూర్​లో ఉంటోంది. ఆదివారం రంగాపూర్​కు వచ్చిన సుభాశ్​రెడ్డి అత్తగారింట్లో ఒంటిపై పెట్రోల్​ పోసుకుని అంటించుకోవడంతో స్థానికులు మంటలు ఆర్పి, అచ్చంపేట హాస్పిటల్​కు తరలించారు. 

పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇదిలాఉంటే తనపై అత్త, మామ, భార్య పెట్రోల్​ పోసి నిప్పంటించారని సుభాశ్ రెడ్డి మీడియాకు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు.