MATKA X Review: వరుణ్ తేజ్ మట్కా ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ 'మట్కా (MATKA). పలాస 1978, మెట్రో కథలు, కళాపురం, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించాడు.

ఇవాళ గురువారం (నవంబర్ 14న) మట్కా మూవీ థియేటర్స్ లో రిలీజైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ వరుణ్ కి ఎలాంటి హిట్ అందించనుందో ట్విట్టర్ X రివ్యూలో తెలుసుకుందాం.

మ‌ట్కా మూవీలో మ‌ట్కా వాసుగా మూడు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్‌తేజ్ యాక్టింగ్ బాగుంద‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో చెల‌రేగిపోయాడ‌ని అంటున్నారు. బ‌ర్మా నుంచి వైజాగ్‌కు బ‌తుకుతెరువు కోసం వ‌చ్చిన ఓ సాధార‌ణ‌ వ‌ల‌స‌కారుడు.. మ‌ట్కా కింగ్‌గా ఎలా అయ్యాడు? ఓ పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నెలకొల్పాడు. ఈ జ‌ర్నీలో అత‌డి సాగించిన పోరాటంతో ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, ల‌వ్ స్టోరీ.. ఇలా ప్రతిదీ బాగుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read :- కంగువ ట్విట్టర్ X రివ్యూ

మట్కా సినిమా రిలీజ్ ముందు రోజు హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. "వరుణ్ తేజ్. ఈ సినిమా మీకు భారీ విజయం అందిస్తుందని భావిస్తున్నాను. వాసు రోల్ కోసం నీవు ఎంత చెమట చిందించావో నాకు తెలుసు. స్క్రీన్ మీద నువ్వు అద్బుతంగా ఉన్నావు. నీ బ్లాక్ బస్టర్ విజయం కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపారు.

మట్కా పూర్తి మాస్ కమర్షియల్ సినిమా. వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ ఇచ్చాడు. 20 ఏళ్లు దాటినా ప్రజలు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారు. అంతేకాదు వరుణ్ తేజ్ పేరు గుర్తుకు వస్తే.. తప్పకుండా మట్కా సినిమా గుర్తుకు వస్తుంది అనే విషయాన్ని డైరెక్టర్ కరుణ కుమార్ చెప్పినట్టు ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

మట్కా అద్భుతంగా ఉందని.. మంచి స్టోరీ అని, ఫైట్ సీక్వెన్స్‌ బాగున్నాయని ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. కామెడీ, యాక్షన్‌, సెంటిమంట్‌, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. మరికొందరైతే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతే.. మట్కా మూవీకి ఓ వైపు పాజిటివ్ టాక్ వస్తుండగా.. మరోవైపు నెగిటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియా నిండిపోయింది. బ్యాడ్ రిలీజ్ డేట్.. ఒక్క మంచి పాట లేదు.. హైప్ లేదు.. అని ట్వీట్లు పెడుతున్నారు. అసలు మట్కాకి ఎక్కడా కూడా బుకింగ్స్ జోరందుకోవడం లేదని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే, సన్నివేశాలు ఆడియన్స్ ని కంప్లీట్ గా డిస్సపాయింట్ చేసేలా ఉందంటూ.. మట్కా వాసు పాత్రకు ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదని అంటున్నారు.

మట్కా స్టోరీ ఊహించేలా ఉందని.. క్లిచ్ సన్నివేశాలతో నిండిన బోరింగ్ రేజ్ టు రిచ్ డ్రామాని అని.. అయితే ఇందులో వరుణ్ తేజ్ మెచ్చుకోదగిన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. కేవలం గ్యాంగ్ స్టార్ కి సంబంధించిన సీన్స్ మినహాయిస్తే.. ఇక మిగతావేం ఇంట్రెస్టింగ్ లేవని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. జివి ప్రకాష్ ఇచ్చిన డీసెంట్ బిజిఎమ్ ఒకే.  కానీ పాటలు కంప్లీట్ స్పీడ్ బ్రేకర్స్లా ఉన్నయని ట్వీట్ చేశాడు. 

కాగా ఇది సోషల్ మీడియాలో నెటిజన్స్ యొక్క సొంత అభిప్రాయం మాత్రమే అని గుర్తించుకోవాలి. పూర్తిగా సినిమా కథ, కథనాలు తెలియాలంటే మట్కా మూవీ థియేటర్స్లో చూసి సొంతంగా ఫీల్ అయ్యి ఎలా ఉందొ తెలుసుకోండి.