రైతులవి న్యాయమైన డిమాండ్లు

రైతులవి న్యాయమైన డిమాండ్లు

రైతులవి న్యాయమైన డిమాండ్లన్నారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. రైతులు తమకు అధికారికంగా రావాల్సిన దాని గురించే అడుగుతున్నారన్నారు. బరేలీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రజలే తమకు అధికారమనే బలం ఇచ్చారన్నారు వరుణ్ గాంధీ. ఆ బలానికి అర్థం తమను తాము గొప్పగా చూపించుకోమని కాదని.. ప్రజలను కూడా గొప్పగా చూపాలని సూచించారు. కులమతాలకతీతంగా ప్రజలకు సేవ చేసేందుకే తాను వచ్చానన్నారు.