Baby John Box Office: కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. రూ.160 కోట్ల బడ్జెట్.. రూ.47 కోట్ల కలెక్షన్స్!

మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ బేబీ జాన్ (Baby John). ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజై బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూస్తోంది. ఏకంగా రూ.160 కోట్ల బడ్జెట్ తో రుపొంచిందిన ఈ మూవీ కేవలం రూ.47 కోట్లు మాత్రమే సంపాదించింది. అంటే, దాదాపు ఈ సినిమాకి రూ.100 కోట్ల మేరకు నష్టాలు తప్పేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో బాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్ కి డిజాస్టర్ ఎంట్రీ మిగిలింది.

వరుణ్ ధావన్, కీర్తి జంటగా నటించిన ఈ మూవీ.. 2016 లో హీరో విజయ్‌‌‌‌తో అట్లీ తీసిన తమిళ తేరి చిత్రానికి ఇది రీమేక్. ఇకపోతే  '2024 డిసెంబర్'.. కీర్తి సురేష్ పెళ్లి కావడంతో ఆనందాన్ని ఇచ్చిన.. బేబీ జాన్ ఫలితం మాత్రం నిరాశని మిగిల్చింది.

అయితే, ఈ సినిమా రిలీజ్కి ముందు పెళ్లి పనులు ఉన్నప్పటికీ కీర్తి సురేష్ ప్రమోషన్స్లో భాగమైంది. అంతేకాదు రిలీజ్ తర్వాత కూడా బాగానే పార్టిసిపేట్ చేసింది. అయినప్పటికీ, బేబీ జాన్ సినిమాకి ఫస్ట్ టాక్ తోనే నెగిటివ్ రివ్యూలు రావడం.. దానికి తోడు తొలి రోజు కేవలం రూ.12 కోట్లు వసూళ్లు చేయడం పెద్ద మైనస్గా మారింది. ఈ కలెక్షన్స్ మాస్ ఎంటర్‌టైనర్‌కు చాలా తక్కువని చెప్పుకోవాలి. అందులోను వరుణ్ ధావన్ వంటి స్టార్ హీరోకి ఈ కలెక్షన్స్ అంటే మరి ఇంకా తక్కువ.

ఇకపోతే ఈ మూవీ రిలీజైన 8వ రోజు నాటికి ఇండియాలో కేవలం రూ.35 కోట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.47 కోట్లు సంపాదించింది. అంటే వారం రోజులు దాటినాక కూడా బేబీ జాన్ రూ.50 కోట్ల మార్క్ టచ్ చేయలేదంటే.. అర్ధం చేసుకోవాలి బేబీ జాన్ పరిస్థితి ఏంటనేది.

అంతేకాదు ఫస్ట్ డే ఏకంగా 4300 షోలతో ప్రారంభమైన ఈ సినిమా.. 8 రోజుల తర్వాత 1800 షోలకు పరిమితమైంది. దీంతో ఈ మూవీ లాంగ్ రన్ లో రూ. 60 కోట్లు మాత్రమే సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో! ఈ సినిమాను జీ స్టూడియోస్‌‌‌‌తో కలిసి డైరెక్టర్ అట్లీ నిర్మించాడు. ఇందులో వామికా గబ్బి మరో హీరోయిన్. కాలీస్ దర్శకత్వం వహించాడు.