లక్నో అమ్మాయి వర్తికా సింగ్, మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. సెప్టెంబర్ 26న ముంబైలో జరిగి న పోటీల్లో ఆమె‘ఇండియా విశ్వ సుందరి’గా నిలిచింది. మిస్యూనివర్స్ 2019 పోటీల్లో ఇండియా తరఫునతన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. మిస్ దివా యూనివర్స్ 2018 నేహాల్ చూడాస్మా,ఆమెకు కిరీటం పెట్టింది. అదే పోటీల్లో మిస్ దివా సుప్రానేషనల్ గా షెఫాలీ సూద్ నిలిచింది.వర్తికా సింగ్ పుట్టింది లక్నోలోనే అయినా,పెరిగింది మాత్రం మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్లో. మిస్ దివా 2014 లోనూ ఆమె పోటీ చేసినా అదృష్టం దక్కలేదు. 2015లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని,ఇండియా తరఫున ప్రపంచ వేదికపై రన్నరప్ గానిలిచింది. అంతేకాదు, ఆ పోటీల్లో బెస్ట్ సోషల్
మీడియా అవార్డునూ ఆమె గెలుచుకుంది. బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ సబ్ కాంటెస్ట్‌లో టాప్ 20లోచోటు దక్కిం చుకుంది. వృత్తి రిత్యా మోడల్
అయినా ఆమె, 2017 కింగ్‌ఫిషర్ క్యాలెండర్గర్ల్స్ లో చోటు సంపాదించింది. క్లినికల్ న్యూట్రిషన్ లో డిగ్రీ చేసిన ఆమె, పబ్లిక్ హెల్త్‌లో పీజీ
చేసింది. ప్యూర్ హ్యూమన్స్ పేరిట ఓ స్వచ్ఛందసంస్థనూ నడుపుతోంది. 2016లో హాటెస్ట్ వుమన్ గా క్రెడిట్ కొట్టేసింది. మిస్ యూనివర్స్ పోటీలను ఎక్కడ, ఎప్పుడు పెడతారన్న దానిపైఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు.మిస్ యూనివర్స్ అవుతా కుటుంబ సభ్యుల మద్దతు , దేవుడి దయతో తానుమిస్ యూనివర్స్ 2019 పోటీల్లో గెలుస్తా ననివర్తికా సింగ్ ధీమా వ్యక్తం చేసింది. మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడం కొంత ఆందోళనకలిగిస్తున్నా, మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నఅనుభవంతో ఆ ఆందోళనను అధిగమిస్తానని తెలిపింది. మిస్ దివా కిరీటం గెలుచుకోవడంచం ద్రుడిపై కాలు పెట్టినంత ఆనందంగాఉందని ఆమె చెప్పింది. కాగా, ప్రపంచ వేదికపైఇండి యా పేరు నిలబెడతానన్న నమ్మకం తనకుందని మిస్ దివా సుప్రానేషనల్ షెఫాలి సూద్ చెప్పింది.

