అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి : వర్ధం పర్వతాలు

కల్వకుర్తి, వెలుగు: అన్ని రకాల వడ్లకు క్వింటాల్​కు రూ.500 చొప్పున బోనస్  ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం పట్టణంలోని పార్టీ ఆఫీస్​లో జరిగిన సమావేశంలో మాట్లాడారు.

 యాసంగి పంటలో 80 శాతం దొడ్డు వడ్లు పండిస్తారని తెలిపారు. అందులో సన్న, చిన్నకారు రైతులు మాత్రమే ఉంటారని, సన్న వడ్లకు మాత్రమే బోనస్  అని ప్రభుత్వం ప్రకటించడంతో నష్టపోతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తామన్నారు. ఆంజనేయులు, మల్లయ్య, బాల్​రెడ్డి, బాలస్వామి, అశోక్, వెంకటేశ్వర్లు, జగన్  పాల్గొన్నారు.