ప్రేమ, పెండ్లి పేరుతో చీటింగ్.. వరలక్ష్మి టిఫిన్స్​ ఓనర్​ అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: ప్రేమ, పెండ్లి పేరుతో ఓ యువతిని చీటింగ్ చేసిన కేసులో గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్​ఓనర్​పై కేసు నమోదైంది. మాదాపూర్​ఏసీపీ తెలిపిన ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభాకర్​రెడ్డి(40) గచ్చిబౌలి పరిధి ఇంద్రానగర్ లో ఉంటున్నాడు. అతను గచ్చిబౌలి డీఎల్ఎఫ్​వద్ద వరలక్ష్మి టిఫిన్స్​పేరుతో ఫుడ్​బిజినెస్​చేస్తున్నాడు.

ఏపీకి చెందిన యువతి (30) నానక్​రాంగూడలో ఉంటుంది. ఆమెతో ప్రభాకర్​రెడ్డికి పరిచయం ఏర్పడగా, ఇద్దరూ కొంతకాలం కలిసి ఉన్నారు.  ప్రేమ, పెండ్లి పేరుతో తనను నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడని గత జనవరిలో యువతి గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేసింది. ప్రభాకర్​రెడ్డిపై అట్రాసిటితో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు ప్రభాకర్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్​కేసులో ప్రభాకర్​రెడ్డిని గతేడాది సెప్టెంబర్12న రాజేంద్రనగర్​ఎస్​ఓటీ, మోకిల పోలీసులు అరెస్ట్​ చేశారు. గోవా నుంచి డ్రగ్స్​తెచ్చి తన  టిఫిన్ సెంటర్​అడ్డాగా అమ్ముతుండగా.. అతడితో పాటు ఓ యువతిని కూడా అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం యువతిపై లైంగికదాడి కేసులో మరోసారి ప్రభాకర్​రెడ్డి అరెస్ట్​అయ్యాడు.