శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి తరలివచ్చే భక్తుల రద్దీ దృష్టా దక్షిణ మధ్య MGR చెన్నై సెంట్రల్ నుంచి కొట్టాయం మధ్య వందేభారత్ ప్రత్యేక రైళ్ళు నడ పనుంది. ట్రైన్ నం. 06151 MGR చెన్నై సెంట్రల్ -కొట్టాయం వందేభారత్ ప్రత్యేక రైలు..డిసెంబర్ 15,17, 22,24 తేదీల్లో ఉదయం 8.30 గంటలకు MGR చెన్నై సెంట్రల్ నుంచి బయలు దేరి అదే రోజు రాత్రి 7.20 గంటలకు కొట్టాయం చేరుకుంది.
రైలు నెం. 06152 కొట్టాయం -చెన్నై సెంట్రల్ వందేభారత్ స్పెషల్ .. డిసెంబర్ 16, 18,23 తేదీల్లో రాత్రి 9 గంటలకు కొట్టాయం నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. ఈ ప్రతక్యేక రైళ్లకు కాట్వాడి, సేలం,ఈరోడ్, పొడనూర్, త్రిసూర్, ఎర్నాకులం టౌనలలో స్టాప్ లు ఉంటాయి.
