షార్ట్  సర్క్యూట్​తో ఇంట్లో మంటలు

  • వృద్ధుడు సజీవదహనం

కొత్తకోట, వెలుగు: వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో శనివారం తెల్లవారుజామున షార్ట్  సర్క్యూట్ తో ఇంటిలో మంటలు చెలరేగి వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  బలిజపల్లి దేవయ్య శెట్టి(95) ఇంట్లో పడుకోగా, ఫ్యాన్​ నుంచి మంటలు చెలరేగగా, మంటల్లో చిక్కుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సజీవ దహనమయ్యాడు. ఇంటి ముందు ఉన్న వారు మంటలు గమనించి కొడుకు విశ్వనాథం యాదగిరికి సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పి చూసేసరికి దేవయ్య చనిపోయి ఉన్నాడు.