ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి : రక్షితకే మూర్తి

మదనాపురం, వెలుగు :  ఫిర్యాదులు తీసుకోవడంలో స్టేషన్​ సిబ్బంది  నిర్లక్ష్యం చేయొద్దని వనపర్తి  ఎస్పీ రక్షితకే మూర్తి తెలిపారు.  మంగళవారం  మదనాపురం పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.   ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ...  పోలీసులు విధుల్లో  నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్​లపై  ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

 కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి,  సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎస్సై శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది సాయి రెడ్డిఖాజా, రాములు, పాల్గొన్నారు.