రేవంత్​రెడ్డిని చూసి కేసీఆర్ భయపడుతుండు : వంశీ కృష్ణ

అచ్చంపేట, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డికి భయపడి కేసీఆర్​ అసెంబ్లీకి రావడం లేదని, కేటీఆర్​ విదేశాలకు వెళ్తున్నాడని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ విమర్శించారు. సోమవారం అచ్చంపేటలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్​ దెబ్బకు కారు నడిపే డ్రైవర్​ ఖతమైండు, షెడ్డుకు వెళ్లిన కారు స్క్రాప్​కు వెల్లాల్సిందేనన్నారు. కార్యకర్తలను ఉత్తేజపర్చాలనే ఉద్దేశంతో కేటీఆర్​ అబద్దాలు చెబుతున్నాడని విమర్శించారు. 

పదేండ్లలో చేసిన అభివృద్ధిని చూపించాలని డిమాండ్​ చేశారు. పాలమూరును ఆగం పట్టించిన బీఆర్ఎస్​ నేతలు ఇక్కడి ప్రజలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని, వారి నాటకాలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మొహపతయ్య, గోపాల్ రెడ్డి, రాజ్​గోపాల్, రాజేందర్, మహబూబ్​ అలీ ఉన్నారు.

ALSO READ : కొత్త చట్టంలో ఎఫ్ఐఆర్