నాచారంలో వాల్యూజోన్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షురూ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరులో రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న  వాల్యూజోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాజాగా  నాచారంలో మరో స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. సినీనటుడు నందమూరి బాలకృష్ణ దీనిని గురువారం ప్రారంభించారు. ఈ కొత్త స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిరాణా సరుకులతో పాటు బట్టలు, చెప్పులు, షూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  స్టేషనరీ వంటి వివిధ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందుబాటులో ఉంటాయి. సాధారణ సరుకులతో పాటు పాపులర్ అయిన ఇండియా, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాండ్లు వాల్యూజోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొరుకుతాయని సంస్థ పేర్కొంది. వాల్యూజోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా గొప్ప రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని, ఇక్కడ అన్ని రకాల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దొరుకుతాయని బాలకృష్ణ పేర్కొన్నారు. 

వాల్యూజోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కలెక్షన్లు, బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం వినియోగదారుల కోసం వేచి ఉన్నాయని వివరించారు.  తమ  స్టోర్లలో ఏడాది పొడవూ  ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిత్యావసర వస్తువులపై ఆఫర్లు ఇస్తున్నామని వాల్యూజోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. నాచారంలోని స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశామని, 40 కి పైగా క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌంటర్లు ఉన్నాయని తెలిపింది. 2 వేలకు పైగా ఉత్పత్తులు, 10 వేలకు పైగా కిరాణా వస్తువులు,  వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లస్ వన్ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి వినియోగదారులను ఆకర్షిస్తాయని ​ అంచనావేస్తోంది.