మెదక్టౌన్, వెలుగు : మహనీయుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం మెదక్కలెక్టరేట్ లో వాల్మీకి జయంతి, కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహాకవి వాల్మీకి రామాయణాన్ని రచించి సమాజానికి విలువలను అందించారన్నారు. ఆదివాసి ఆత్మగౌరవానికి ప్రతీక కొమరం భీమ్ అని జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారన్నారు. కార్యక్రమాల్లో జడ్పీ సీఈవో ఎల్లయ్య, బీసీ వెల్ఫేర్ఆఫీసర్ నాగరాజుగౌడ్, సంబంధిత జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఓటరుగా నమోదుచేసుకోవాలి
జిల్లాలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదుచేసుకోవాలని, ఇందుకోసం అన్ని తహసీల్దార్ఆఫీసుల్లో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్రాహుల్రాజ్తెలిపారు. గురువారం హవేళీ ఘనపూర్మండల తహసీల్దార్ఆఫీసులో తన ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. 2021 నవంబరులోగా డిగ్రీ- పూర్తి చేసిన వారు అర్హులని, నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చన్నారు. డిగ్రీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ , ఓటర్ ఐడీ , పాస్పోర్టు సైజ్ ఫొటో, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ అవసరమవుతాయన్నారు.
వాల్మీకి చరిత్ర అందరికీ ఆదర్శం
సిద్దిపేట రూరల్ : వాల్మీకి జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమని సీపీ అనురాధ అన్నారు. గురువారం వాల్మీకి జయంతి సందర్భంగా సీపీ ఆఫీస్ లో ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాడిగా జీవితం గడిపి సప్తరుషుల బోధనలను ద్వారా మహర్షిగా మారి రామాయణం గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏవో యాదమ్మ, ఇన్ స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్, శ్రీధర్, మల్లేశంగౌడ్, సూపరింటెండెంట్లు మమ్మద్ ఫయాజుద్దీన్, అబ్దుల్ ఆజాద్, అలీషా పాల్గొన్నారు.