మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? : కలెక్టర్ వల్లూరి క్రాంతి

  • రంజోల్ బాలికల  గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ 
  • జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి  

జహీరాబాద్, వెలుగు: మెనూ ప్రకారం గురుకుల పాఠశాలలో వంటలు వండుతున్నారా నాణ్యమైన  భోజనం పెడుతున్నారా అంటూ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి  విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం జహీరాబాద్ మండలం రంజోల్ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  

నూతన మెనూ అమలుపై  అడిగి తెలుసుకున్నారు.  విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.  వంటగది, స్టోర్ రూమ్ ని పరిశీలించారు.  విద్యార్థులకు కొత్త  మెనూ ప్రకారం భోజనాలు అందించాలని ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంటజహీరాబాద్ రెవిన్యూ డివిజన్ అధికారి రామ్ రెడ్డి జహీరాబాద్ మండల ప్రతేక్య అధికారి భిక్షపతి, ఎంపీడీఓ తహసీల్దార్, ప్రిన్సిపల్  పాల్గొన్నారు.